మెదక్ [medak]జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి
వెల్దుర్తి [Veldurti]జనవరి 22 సిరి న్యూస్
వెల్దుర్తి మండల కేంద్రంలో గల శాఖ గ్రంథాలయ కొత్త భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డి తెలిపారు బుధవారం నాడు వెల్దుర్తి మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించింది. పెండింగ్లో ఉన్న పనులు మూడు నాలుగు రోజులలో పూర్తిచేసి అట్టి పనులు పూర్తిగా కాగానే పాత గ్రంథాలయం భవనంలో ఉన్న పుస్తకాలను తీసుకువచ్చి విద్యార్థులు యువకుల కొరకు అందుబాటులో ఉండేలా చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పక్కనే ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించిన సుహాసిని రెడ్డి కి ఎంఈఓ ,హెచ్వోడి సాంబయ్య పిల్లలకు మధ్యాహ్న భోజన సమయంలో బయట కూర్చుని తినడానికి ఇబ్బంది అవుతుందని మన ఊరి మనబడి లో నిర్మించిన డైనింగ్ హాల్ ను అందుబాటులోకి తేవాలని కోరారు. మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లి సమస్య తీరుస్తానని ఆమె హామీ ఇచ్చారు. తర్వాత పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడారు. పిల్లలకు అల్పార విషయమై హెచ్వోడి సాంబయ్యని అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం ఏర్పాటు చేస్తున్న తన్నీరు రమేష్‌ను ఆమె అభినందించారు. ఈసందర్భంగా సుహాసిని రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థజిల్లా సెక్రెటరీ వంశీకృష్ణ వెల్దుర్తి లైబ్రేరియన్ స్వామి ఎంఈఓ అరికల యాదగిరి, హెచ్వోడి సాంబయ్య, ఉపాధ్యాయ బృందం, మండల నాయకులు సుధాకర్ గౌడ్ నరేందర్ రెడ్డి శేఖ గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ కిష్టా గౌడ్ లు పాల్గొన్నారు.