డంపింగ్ యార్డ్‌కు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి, గాంధీ విగ్రహానికి వినతి పత్రం
స్వచ్ఛందంగా వర్తక సంఘాల ఆధ్వర్యంలో వ్యాపార సంస్థలు మూసివేత
నల్లవల్లి గ్రామంలో మూకుమ్మడిగా బంద్ పాటింపు
సంఘీభావం తెలిపిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
సిరి న్యూస్ /గుమ్మడిదల రూరల్[Gummadidalila rural]
రెండవ రోజు గుమ్మడిదల మండలంలో డంపింగ్ యాడ్ ఏర్పాటుకు నిరసన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మండలం రణరంగంగా మారింది. నల్లవల్లి, కొత్తపల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా గ్రామ ప్రజలు మొత్తం రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలోకి పోయిన పోలీస్ పహారా సాగుతుంది అయినా ప్రజలు వాటిని లెక్కచేయకుండా డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల పచ్చని పంట పొలాలు దుర్గంధపూరితంగా మారుతాయని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదు అంటూ అన్ని గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. గుమ్మడిదల చౌరస్తా వద్ద మంబాపూర్ బస్టాండ్ వద్ద నల్లవల్లి బస్టాండ్ వద్ద డంపు యాడ్ కు పోయే ప్రాంతంలో పోలీస్ పహారా భారీగా మోహరించారు ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేస్తున్నారు అయినా ప్రజలు ముందుకు వస్తూ నిరసనలు ర్యాలీలు తో ముందుకు పోతున్నారు.
విగ్రహాలకు వినతి పత్రాలు
గుమ్మడిదల మండలంలోని ప్యారా నగర్‌లో ప్రభుత్వం డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేయడాని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, రైతు సంఘం వద్ద గల గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని గురువారం అందజేశారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రజలకు సంఘీభావం తెలిపారు.
డంపింగ్ యార్డ్ ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని
డంపింగ్ యార్డ్ ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల నిరసనకు విరుద్ధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల అఖిలపక్ష నాయకులు యువజన సంఘాల నాయకులు మండలంలోని యువకులు తదితరులు పాల్గొన్నారు.
సెల్ టవర్ కి యువకుల నిరసన
డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా గుమ్మడిదల నల్లవల్లి గ్రామాలలో యువకులు సెల్ ఫోన్ టవర్లో ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు డంపింగ్ యార్డ్ వల్ల వ్యవసాయ భూములన్ని దుర్వాసనతో నిండుకుంటాయని పచ్చని పంట పొలాలు నాశనం అవుతాయని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విరమించుకోకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు
వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్
వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. గుమ్మడిదల దోమడుగు వర్తక సంఘం సభ్యులు డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలను మూతపడినాయి.