తమ పేరు రాక ఆందోళనలో ప్రజలు
సిరి న్యూస్ గుమ్మడిదల రూరల్ [Gummadila Rural]
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయడానికి కోసం గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలను ఏర్పాటు చేసింది అందులో భాగంగా మంగళవారం గుమ్మడిదల మండలంలోని గుమ్మడిదల బొంతపల్లి, దోమడుగు కానుకుంట గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించారు. ఉదయాన్నే ప్రారంభ గ్రామసభ సర్వే ద్వారా నిర్వహించిన పేర్లను చదువుతుండగా గ్రామస్తులు అర్హులహమై ఉండి తమ పేరు లేదని ఆందోళనకు దిగినారు అర్హుల పేర్లు చాలా అనహరుల పేరు ఎక్కువగా ఉన్నాయని గ్రామస్తులు వాపోయారు. అసలైన అర్హులకు లిస్టులో పేర్లు నమోదు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ జాబితాను పునర్ పరిశీలించి అర్హులకు పథకాలను అందజేయాలని గ్రామాల ప్రజలు కోరారు ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో రంగంలోకి పోలీసులు దిగి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.