పదేండ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా?

Ten years in power have you given even one ration card
Ten years in power have you given even one ration card

ప్రజల సమక్షంలో లబ్ధిదారులఎంపికను చూసి ఓర్వలేక విమర్శలు
ఏనాడైనా మండల, పట్టణ ప్రజల సమస్యలు పట్టించుకున్నారా
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్
చేగుంట[chegunta] జనవరి 25 (సిరి న్యూస్) :
గత పడేండ్లు ఇటు టిఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి ఏనాడైనా గ్రామసభలు నిర్వహించి ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా? అని రెండు పార్టీ లను విమర్శించారు.రాష్టం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఇచ్చిన హామీ ప్రకారం 6 పథకాలు అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించాలనే లక్ష్యంతో గ్రామసభలు నిర్వహించి ప్రజల మధ్యనే లబ్ధిదారులను ఎంపిక చేస్తుంటే, ఇది చూసి ఓర్వలేక బిఆర్ఎస్, బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక పర్యాయం, టీ అర్ ఎస్ ,రామలింగారెడ్డి, అతను చనిపోహినప్పుడు బిజెపి, మళ్ళీ ఎలక్షన్ లో టీ అర్ ఎస్ ఎమ్మెల్యే (ప్రస్తుతం ),అధికారం లో ఉంటే నియోజకవర్గం ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి ఏనాడైనా చేగుంట కు వచ్చి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని అయన స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రజల సమస్యలు పట్టించుకునే నాధుడు లేడని ఆయన అన్నారు,ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామాల్లో అధికారుల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు.నియోజవర్గానికి చెందిన కొంత మంది బిఆర్ఎస్ నేతలు తన ఉనికిని కాపాడుకోవడం కోసమే మీడియా సమావేశాలు నిర్వహించి,ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలని ప్రజలు కోరుకుంటుంటే ప్రజలకు చేరకుండా బిఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని నవీన్ కుమార్ ఘాటుగా విమర్శించారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, దుబ్బాక యూత్ అధ్యక్షులు సయ్యద్ ఉస్సమోద్దీన్, మండల యూత్ అధ్యక్షులు మెహన్ నాయక్, సినియర్ నాయకులు కాషా బోయినా శ్రీనివాస్ తదితరులు పాల్గున్నారు