స్వామి వివేకానంద గొప్ప తత్వ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి..

Swami Vivekananda was a great philosopher and multifaceted genius..
Swami Vivekananda was a great philosopher and multifaceted genius..

యువతకు స్వామి వివేకానంద చూపిన మార్గం అనుసరణీయం : నీలం మధు ముదిరాజ్..
ఘనంగా స్వామి వివేకానంద జయంతి..
ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నీలం మధు..
పటాన్ చెరువు రూరల్ జనవరి 12 (సిరి న్యూస్)
నేటి యువత స్వామి వివేకానందను  [Swami Vivekananda] చూసి నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది ఎంతో ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిట్కుల్ లోని ZPHS స్కూల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానందుడు ప్రపంచ దేశాలు గుర్తింపు పొందిన తత్వ వేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి పొందారని ఆయన తెలిపారు, దేశ భవిష్యత్తు యువతతోనే ఉందని ఆయన చెప్పిన మాటలు అక్షరాల సత్యం అని ఆయన తెలిపారు. అన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడి సందేశం ఇచ్చే ప్రముఖ వ్యక్తిగా నిలిచారన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా కూడా అనేక సందర్భాల్లో ఆయన కలంతో హిందూత్వాన్ని చాటి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన సంఘ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు..