జాతీయ యువజన దినోత్సవం ( వివేకానంద జయంతి)
గుమ్మడిదలలోనూతన విగ్రహ ఆవిష్కరణ
సిరి న్యూస్ /గుమ్మడిదల
సమస్త శక్తి మీలోనే ఉంది… అసమర్థులని భావించకండి.. మీరు ఏమైనా చేయగలరు.. అన్నిటినీ సాధించగలరు.. ఈ దేశానికి మీరు భవిష్యత్తు.. రండి లేచి రండి నిలబడండి…
అంటూ స్ఫూర్తివంతమైన ప్రసంగాలతో యువతను ఆయన మెలకుల్పారు భారతదేశం అందించిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు యువతను ఉత్తేజపరిచిన వారిలోనూ ఆయన అగ్రగన్యుడు ఆ మహా మనిషిని స్వామి వివేకానందుడు ఆయన జన్మదినం సందర్భంగా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం గా ప్రభుత్వం ప్రకటించింది పట్టుదల ఆత్మవిశ్వాసం సంకల్పం అనేవి మానవ జీవితంలో వెలుగులు నింపుతాయని స్వామి వివేకానంద బోధించాడు రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడు వివేకానందుడు. తన గురువు పేరిట రామకృష్ణ మిషన్ ను స్థాపించాడు. స్వామి వివేకానంద కలకత్తాలో 1863 జనవరి 12వ తేదీన భువనేశ్వరి దేవి విశ్వనాథ దత్త దంపతులకు జన్మించాడు ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ అందరూ ఆయనను నరేన్ అని పిలుచేవారు చిన్ననాటి నుండి ధైర్యం పేదలపై సానుభూతి సాధువుల ఆకర్షణ వంటి లక్షణాలు ఆయనకు అలబడ్డాయి. 1893 సెప్టెంబర్ 11 అమెరికాలోని చికాగో మహానగరంలో నిర్వహించిన సర్వమత సమ్మేళనంలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పాడు ఆయన 39 సంవత్సరాల యవ్వనంలో ఉండగానే మరణించాడు. చిన్న వయసులోనే వందేళ్ళకు సరిపడా పనులను చేయగలిగాడు. భారత దేశ విశిష్టతను హిందూ సంస్కృతి గొప్పదనాన్ని వివరించాడు. భారతీయ సంస్కృతి వారసత్వాలను కాపాడుకుంటూనే నవ్యమైన సమాజం కోసం కృషి చేయాలని యువత పిలుపునిచ్చారు. స్వార్ధాన్ని వీడి దేశ సమాజం కోసం నడుం బిగించాలని యువత సైనికుల తన వెంట నడవాలని సూచించారు.
వివేకానందుని విగ్రహావిష్కరణ
మండల కేంద్రమైన గుమ్మడిదలలోని ప్రాథమిక పాఠశాల ముందు వివేకానందుని జయంతి సందర్భంగా సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన వివేకనందుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని సి జి ఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి కోరారు.