యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

Swami Vivekananda is an inspiration to the youth
Swami Vivekananda is an inspiration to the youth

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి
పటాన్చెరు[patanchru]
సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 162వ జయంతినీ పురస్కరించుకొని గురువారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారని కొనియాడారు. ఆయన పుట్టిన రోజును దేశ వ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, అఫ్జల్, వంగరి అశోక్, వెంకటేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.