50 ఏళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి పీ.డీ.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం రావడం ఇదే మొదటిసారి.
సిరి న్యూస్ సిద్ధిపేట[siddipet]
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ.డీ.ఎస్.యూ) తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సిద్దిపేట జిల్లాకు చెందిన ఎస్వీ.శ్రీకాంత్ నిన్న ఖమ్మంలో జరిగిన సంస్థ ఐక్యత సభలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
2023 నిజామాబాద్ లో జరిగిన సంస్థ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శ్రీకాంత్ కు నిన్నటి ఖమ్మం సభలో రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా,అధ్యక్షుడిగా పనిచేసిన వారిలో శ్రీకాంత్ మొదటివాడు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి రెండోసారి ప్రధానమైన బాధ్యతలు అప్పగించిన పీడీఎస్.యూ రాష్ట్ర కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.పీడీఎస్.యూ నిర్మాత జార్జిరెడ్డి స్ఫూర్తితో భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను మరింత ఉదృతం చేస్తామని, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పక్షాన బలమైన గొంతు వినిపిస్తామని ఆయన తెలిపారు.