ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను పరిశీలిస్తున్న పటాన్చెరు ఎంపీడీవో యాదగిరి
పటాన్‌చెరు ఎంపీడీవో యాదగిరి
పటాన్‌చెరు, జనవరి 7 సిరి న్యూస్ః
నిరుపేదల సొంతింటి కలలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల సర్వే కార్యక్రమం పటాన్చెరు మండలంలో 95% పూర్తయిందని, నేటితో 100% పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు ఎంపీడీవో యాదగిరి తెలిపారు. మంగళవారం పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్, రుద్రారం గ్రామాలలో ఇళ్ల సర్వేన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు మండల పరిధిలోని 14 గ్రామాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం 12498 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మంగళవారం వరకు 11,891 దరఖాస్తుల సర్వే పూర్తయిందని, మిగిలిన 607 ఇళ్ల సర్వే ను నేటితో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, గ్రామపంచాయతీ కార్యదర్శులు రాజ్ కుమార్, ప్రవీణ్ పాల్గొన్నారు.