★ పనినేపంతో పరిసరాలు గాలికి
★పందుల సైరవిహారం పట్టించుకోని అధికారులు
★ఆదర్శంగా ఉండేటోళ్లే ఆదా మరిస్తే ఎట్లా
★కౌడిపల్లి లో ప్రతి ప్రభుత్వ కార్యాలయం పరిసరాలు అధ్వానం
★కార్యాలచుట్టు ప్లాస్టిక్ పేరుకుపోయి దుర్గంధవాసన.
కౌడిపల్లి[Kaudipalli]ఫిబ్రవరి (సిరి న్యూస్)
పరిశుభ్రత పచ్చదనం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి డ్రై డే ఫ్రైడే పేరిట ప్రత్యేకంగా ఒక వారాన్ని పరిశుభ్రత కోసం కేటాయిస్తే అధికారులు మాత్రం తమకేమీ పట్టదన్నట్లు తమ పరిసరాలననే గాలికి వదిలేశారు.
ప్రతినిత్యం వివిధ పనుల మీద ఎంతో మంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు విచ్చేస్తుంటారు. ఒక్కోసారి వచ్చే పనికాక వేచి చూడవలసి వస్తుంది అలాంటప్పుడు కార్యాల పక్కన వేచి చూద్దాం అంటే కార్యాలయ చెట్టు దుర్గంధo వాసన రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రం కౌడిపల్లిలోని ప్రభుత్వ కార్యాలయాల ల పరిసరాలు చెత్తాచెదారం పేరుకొని ఈగలు, దోమలతో దుర్గంధం వెదజల్లుతుంది. కానీ అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవట్లేదు ఆదర్శంగా ఉండవలసిన ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల పట్టింపు లేక ఈ దృష్టికి చేరుకోవడం ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు పందుల సైరవిహారాలు
ముఖ్యంగా పంచాయతీరాజ్ సబ్ డివిజన్ పరిసరాలు పూర్తి అధ్వానంగా మారాయి కార్యాలయం చుట్టూ ప్లాస్టిక్ వ్యర్థాలు పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారింది దీంతో దుర్వాసన వెదజల్లుతుంది.
చుట్టూ మటన్, చికెన్ షాపులు డబ్బాల వెనుక వ్యర్థాలు
ప్రభుత్వ కార్యాలయాలకు ఓ పక్కన మటన్, చికెన్ షాపులు ఉండడంతో యతెచ్చుగా వారు వ్యర్ధాలు ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా పడేస్తున్నారు. దీంతో ఆ వ్యర్ధాల కోసం పందులు, కుక్కలు, కోతులు లకు అడ్డాగా మారాయి .
పని నేపంతో పరిసరాలు గాలికి
అధికారులు తమ పని నేపంతో కార్యాలయాల పరిసరాలను గాలికి వదిలేస్తున్నారు. పచ్చదనం పరిశుభ్రతతో పచ్చని మొక్కలతో ఆదర్శంగా ఉండే కార్యాలయాలు అధ్వానంగా మారాయి. వారంలో ఒకరోజు సిబ్బందిని కేటాయించి మొక్కల సంరక్షణకు కేటాయిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కనీస సౌకర్యాలు కరువు
ప్రభుత్వ కార్యాలయాలకు వివిద పనుల మీద మండల వ్యాప్తంగా ప్రతినిత్యం ఎంతోమంది ప్రజలు విచ్చేస్తుంటారు. కనీసం పనులు పూర్తయ్యేంతవరకు వేచి చూద్దాం అంటే బయట కూర్చుని కి సౌకర్యం లేకుండా పోయింది. అలాగే బాత్రూములు లేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రహరీ గోడ లేక నానా ఇబ్బందులు
తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ఎంఆర్సి, ఐకెపి ఇలా సామూహిక భవనాలు ఒకచోట ఉన్నప్పటికీ చుట్టూ ప్రహరీ గోడ లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి గతంలో పలుమార్లు సమావేశాల్లో నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ నీరుగారిపోయింది.
పరివేక్షణ లోపంతోని అపరిశుభ్రత
అధికారులు కేవలం తన పనులు ముగించుకొని వెళ్ళిపోతున్నారే గాని తమ కార్యాలయాల బాగోగులు మాత్రం గాలి కోసలేశారు. పరివేక్షణ లోపంతోనే అపరిశుభ్రతతో తాండవిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆదర్శంగా ఉండే కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని కోరుతున్నారు.