నారాయణఖేడ్[Narayankhed]: జనవరి 25 (సిరి న్యూస్)
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ రూపొందించిన నూతన సంవత్సర 2025 క్యాలెండరును జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. గౌడ సోదరుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు.నియోజకవర్గంలో గౌడ కులస్తులకు అండగా ఉంటానని వారికి ఉపాది అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం నాయకులు ఆయనకు శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సంఘం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అంజా గౌడ్, జతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి విగ్రాం రాజన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, మోహన్ గౌడ్,అశోక్ గౌడ్…గౌడ సంఘం నాయకులు రాంచెందర్ గౌడ్, ఖెడ్ మాజీ ఉప ఎంపిపి మాణిక్ గౌడ్, విఠల్ దాస్ గౌడ్,సుదర్శన్ గౌడ్,కల్లుగీత కార్మిక సంఘం ఖేడ్ డివిజన్ అధ్యక్షులు నరసింహా గౌడ్,నాయకులు భూమా గౌడ్, శంకర్ గౌడ్,సంఘం కంగ్టి మండల ఉపాధ్యక్షులు చంద్రకాంత్ గౌడ్,నాయకులు సుభాష్ గౌడ్,జనార్ధన్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్, రామా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.