నర్సాపూర్[narsapur] మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి .!!
శివంపేట్[shivampet] జనవరి 29( సిరి న్యూస్ )
రాష్ట్రంలో పథకాలు అమలు పరచడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమయ్యారు. గ్రామ సభలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజలు ఎక్కడ మరియు పథకాల గురించి నిలదీస్తారో అని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి , కాంగ్రెస్ నాయకులు ముందుగానే కుర్చీలో లొల్లి మొదలు చేస్తున్నారు . నీకు నిజంగా పేద ప్రజలపై ఆత్మ అభిమానం ఉన్న ముందుగా ప్రతి గ్రామాలలో తిరిగి పేద రైతులకు ప్రజలకు పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకొని కుర్చీల కొట్లాటకు పోతే బాగుంటది. పేద ప్రజలు ప్రజల బాధలు అర్థం కావాలంటే మాసాయిపేట వార్డు మెంబర్గా లేదా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేయాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మీరు ఎన్ని గగ్గోలు పెట్టినా ఎన్ని ఆటంకాలు కలిగించిన నర్సాపూర్ కు సునీత లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యే అనేది మర్చిపోకండి. మీ రేవంత్ రెడ్డి హామీలు అన్ని గ్రామాలు అమలు అయ్యేలా చూస్తే కనీసం ప్రజలు క్షమిస్తారు. దయచేసి సునీత లక్ష్మారెడ్డి,బిఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేయాలనుకుంటే ప్రతిదాడి తప్పదని మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు