పెద్దశంకరంపేట[pedda pedda shankarampet,(సిరి న్యూస్):
విద్యార్థులు కష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎంఈఓ వెంకటేశం అన్నారు. శనివారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పర్యవేక్షించిన అనంతరం వారికి అల్పాహారంను అందించారు. పరీక్షలంటే భయాందోళనలు చెందవద్దని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్దిరాములు, ఎమ్మార్సీ సిబ్బంది సంపత్ రెడ్డి , తదితరులున్నారు.