విద్యారంగానికి మొండి చేయి.. కేంద్ర బడ్జెట్ పై పవన్ కుమార్ ఫైర్..

Stubborn education sector.. Pawan Kumar fire on central budget..

సిరి న్యూస్ సిద్ధిపేట నంగునూర్:[Siddipet Nangunu]
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశ విద్యారంగానికి మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని సిద్దిపేట్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్ విమర్శించారు. నంగునూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సాదుల పవన్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం సిగ్గుచేటని, కేంద్రం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. విద్యను ప్రయోజనవంతంగా అభివృద్ధి చేస్తున్నామనే ప్రచారం ఉన్నప్పటికీ, వాస్తవాలు కేంద్ర విధానాలు విరుద్ధంగా ఉన్నాయనీ, జీడీపీలో విద్య రంగానికి కేటాయింపు 6 శాతం ఉండాలి కానీ, బడ్జెట్‌లో కేవలం 2.8 శాతం మాత్రమే కేటాయించారని విమర్శించారు. 100 శాతం నాణ్యమైన పాఠశాల విద్య, సమ్మిళిత వృద్ధి అనే వాగ్దానం అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. అలాగే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పక్షపాతం చూపించింది. 8 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నప్పటికీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరు మెదప లేదన్నారు. బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు వరాలు కురిపిస్తూ, తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు మొండి చెయ్యి చూపించడం తీరని అన్యాయమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బడే.అశోక్, నవీన్, బొజ్జ గోపి, శ్రీధర్, రాజు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.