భయాందోళనలో ప్రజలు …
ఏడుపాయల,[Edupayalu] ( సిరి న్యూస్):-
కుక్కలకు వింత వ్యాధి సోకడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నా రు. ఏడుపాయలకు వచ్చిన భక్తులు ఎలర్జీ లేసిన కుక్కలను చూసి ఆందోళన చెందుతున్నారు . ఈ మధ్య కాలంలో ప్రతి గ్రామాలలో చికెన్ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడే విదిల్చడంతో వాటిని తిం టున్న వీధి కుక్కలు ఎలర్జీతో బాధపడుతూ ఏడుపాయల పరిసర ప్రాంతంలో పగలు రాత్రి అనక అక్కడే ఉండి అక్కడికి వచ్చిన భక్తులు వంటలు చేసుకుందామంటే ఎలర్జీ ఉన్న కుక్కలను చూసి భయపడుతున్నారు. అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చిన కుక్కలు ఏడుపాయలలో సంచరిస్తున్నాయి. వీటితో ఉండే పలు వీధి కుక్కలకు కూడా ఈ అంటు వ్యాధుల వ్యాపించి తీవ్రమైన ఎలర్జీ వ్యాధి బారిన పడుతున్నాయి. దీ నిపై ఏడుపాయల ఎండోమెంట్ అధికారులు, కానీ పశువైధ్యులు కానీ దృష్టి సారించకపోవడంతో స్థానికులు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలర్జీ వ్యాధి బారిన బడిన వీధి కుక్కలను గుర్తించి వాటికి సరైన వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు. అలా కాకుండా వాటిని కట్టడి చేయాలని, ఈ ఎలర్జీ బారి పడిన కుక్కల నివారణ చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాలకు చెందిన గ్రామస్తులు, పలువురు వేడు కుంటున్నారు.