హోరాహోరీ పోరులు మధ్య రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు

State-level sports festivals amid fierce battles
State-level sports festivals amid fierce battles

నువ్వా నేనా అంటూ
హోరాహోరీ పోరులు మధ్య రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు
సిరి న్యూస్/ గుమ్మడిదల
మండల కేంద్రమైన గుమ్మడిదలలో [gummadidala] రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు హోరా హోరీ పోరుల మధ్య సాగుతున్నాయి. జిల్లాలో క్రీడలకు పెట్టింది పేరుగా ముందుగా వచ్చేది గుమ్మడిదల. దాదాపు పది సంవత్సరాల తర్వాత మండల కేంద్రమైన గుమ్మడిదలలో క్రీడోత్సవాలకు సిజిఆర్ ట్రస్ట్ ఆతిథ్యం ఇచ్చింది. క్రీడోత్సవాలకు వచ్చిన క్రీడాకారులకు భోజన వసతి తో పాటు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ట్రస్ట్ తగు చర్యలు తీసుకుంటున్నారు. 30 వాలీబాల్ , 32 కబడ్డీ టీలు వచ్చాయి. గ్రామంలో క్రీడోత్సవాలతో పండుగ వాతావరణం నెలకొన్నది. గ్రామ ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా క్రీడోత్సవాలను తిలకిస్తున్నారు. హెడ్ లైట్స్ మధ్య రాత్రి సమయంలో కూడా క్రీడలను నిర్వహిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి
అడిషనల్ ఎస్పీ సంజీవరావు.
శనివారం సి జి ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలలో పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ
యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. గ్రామీణ స్థాయి నుండి క్రీడలలో నైపుణ్యం పెంచుకొని రాష్ట్రస్థాయి జాతీయ స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్ , మాజీ ఉప సర్పంచ్ మొగులయ్య, పొన్నాల శ్రీనివాసరెడ్డి , సూర్యనారాయణ, కాళ్ళ కంటి రవీందర్ రెడ్డి ,కర్ణాకర్ గౌడ్, రాములు గౌడ్ ,మల్లేష్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, సదానంద రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు పోర్చుగారి మోహన్ రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.