గీతా యజ్ఞశ్రీ కూచిపూడి.
సిరి న్యూస్ అందోల్ (10-01-2025)
ఈరోజు వైకుంట ఏకాదశి సందర్భంగా జోగిపేట నుండి గీత యజ్ఞశ్రీ కూచిపూడి అకాడమీ ఫౌండేషన్ లో సంగారెడ్డి వైకుంఠపురంలో కూచిపూడి ప్రదర్శన అంగరంగ వైభవంగా ప్రదర్శించారు,
కూచిపూడి నాట్య ప్రదర్శనకు తల్లిదండ్రులు పిల్లలు తోపాటు చాలామంది హాజరైనారు,
వైకుంటపురం ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామినీ భక్తులకు దర్శనం ఇవ్వగా,ఆ సుందర దృశ్యాన్ని తిలకించి పులకించిన భక్తజనులు, అనంతరం ఆలయంలో
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అంటూ జయ జయధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు ముక్కోటి విశిష్టతను హాజరైన భక్తులకు వివరించారు, ఈ కార్యక్రమంలో జెల్ల రక్షిత,దీపిక, సంగీత,వర్షిత,నాగలక్ష్మి,యోగశ్రీ,అన్విక,ప్రణిత, విషస్వి,వీళ్లతో పాటు 92నాట్య ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా ఉత్సవాలు నిర్వహణలో సహకరించిన భక్తులకు,ధాతలకు,పాత్రికేయులకు ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.