అదనపు కలెక్టర్ నాగేష్ కి వినతిపత్రం అందజేసిన గిరిజన నాయకులు
మెదక్ టౌన్ ఫిబ్రవరి 1 సిరి న్యూస్
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ నీ మర్యాద పూర్వకం గా కలిసి శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ని సెలవుదినం గా ప్రకటించాలని శుక్రవారం గిరిజన నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ భారతదేశంలోని దాదాపు 18 కోట్ల జనాభా కలిగిన గిరిజనులకు ఒక ప్రత్యేక సెలవు దినం ఉండాలనే ఉద్దేశంతో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ని సెలవుదినం గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వమే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించి,గిరిజన భాష అయినటువంటి గోర్, బోలిని అధికార భాషగా గుర్తించి 8 వ షెడ్యూల్డ్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 10 శాతం రిజర్వేషన్ ను ప్రభుత్వం ప్రకటించే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ లో వర్తింపజేసి, మెదక్ జిల్లా ను చార్మినార్ జోన్ లో కలపాలని ఈ సందర్భంగా కలెక్టర్ ని కోరడం జరిగింది. ఈ సమావేశంలో గోపాల్ నాయక్, శ్రీను నాయక్,అశోక్ నాయక్, రమేష్ నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.