మండల అధ్యక్షులు బాధ్యానాయక్
చేగుంట[chegunta] ఫిబ్రవరి 1 సిరి న్యూస్
శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ని సెలవుదినం గా ప్రకటించాలని మండల అధ్యక్షుడు బద్య నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,నేడు శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడి వద్ద మండల ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు,
ఈ సందర్భంగా బద్యనాయక్ మాట్లాడుతూ భారతదేశంలోని దాదాపు 18 కోట్ల జనాభా కలిగిన గిరిజనులకు ఒక ప్రత్యేక సెలవు దినం ఉండాలనే ఉద్దేశంతో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ని సెలవుదినం గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వమే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించి,గిరిజన భాష అయినటువంటి గోర్, బోలిని అధికార భాషగా గుర్తించి 8 వ షెడ్యూల్డ్ లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బద్య నాయక్, ఉపాధ్యక్షులు మోహన్ నాయక్, రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షులు హరిచంద్ నాయక్, చక్ర సింగ్ నాయక్, జైల్ సింగ్ నాయక్ , సుభాష్ నాయక్,శంకర్ నాయక్, శేఖర్ నాయక్, ఉమ్లా నాయక్, రమేష్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.