భక్తులకు అన్నదానం నిర్వహించిన స్థలదాతలు పబ్బ రమేష్ గుప్త – స్వరూప రాణి కుటుంబసభ్యులు!!
శివంపేట్[shivampet] జనవరి 29 (సిరి న్యూస్ )
దేశంలోనే అత్యంత శక్తిపీఠాలలోనే ఒకటైన శివ్వంపేట శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో బుధవారం మాఘ అమావాస్య పర్వదినం సందర్బంగా అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖీ అమ్మవారికి మహాపూజలు నిర్వహించారు . బగలాముఖీ అమ్మవారిని పీతవర్ణ పుష్పాలు, పీతవర్ణ వస్త్రాలతో విశేషంగా అలంకరించి, అమ్మవారికి విశేషమైన పసుపుతో హరిద్రార్చన నిర్వహించి, రుద్రాయామల, శ్రీసూక్త, దేవి సూక్త, బగలా అష్టోత్తర నామర్చనలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, మంత్రపుష్పం కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించి, నానా విధఫలాలతో నైవేద్యం సమర్పించడం జరిగినది. అనంతరం బగలాముఖీ శక్తిపీఠం ప్రాంగణంలో అమ్మవారికి మహామంత్ర హావనము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది.
స్వర్గీయ పబ్బ అంజయ్య – రామమ్మ జ్ఞాపకార్థం అన్న ప్రసాద వితరణ మాఘ అమావాస్య పర్వదినం కావడంతో ఉమ్మడి తెలుగురాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల నుండి వచ్చిన అమ్మవారి భక్తులతో శ్రీబగలాముఖీ శక్తిపీఠం కిటకిటలాడింది. మాఘ అమావాస్య పర్వదినం సందర్బంగా అమ్మవారి దర్శనభాగ్యం కోసం విచ్చేసిన భక్తులందరికి ప్రతి అమావాస్యకు మాదిరిగానే స్వర్గీయ పబ్బ అంజయ్య – రామమ్మ జ్ఞాపకార్థం స్థలదాతలు పబ్బ రమేష్ గుప్త – స్వరూప, పబ్బ మహేష్ గుప్త – స్వాతి దంపతులు తమ స్వంత డబ్బులతో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలోమాజీ తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పుణ్య దంపతులు, తెలుగు చలనచిత్ర నిర్మాత , వారాహి చలనచిత్ర బ్యానర్ కొర్రపాటి సాయి , శివంపేట గ్రామపంచాయతీ మాజీ పాలకవర్గం సభ్యులు, మరియు పబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు, భగలాముఖి శక్తిపీఠం భక్తులు తదితరులు పాల్గొన్నారు.