నక్సల్స్, డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి – డిజిపి జితేందర్

శాంతిభద్రతల పరిరక్షణకు ఎల్లవేళలా కృషి చేస్తాం
సైబర్ క్రైమ్ లో 180 కోట్ల రికవరీ
పోలీస్ శాఖకు ప్రభుత్వం ఎంతో తోడ్పాటు
పోలీసుల సంక్షేమ ప్రథమ కర్తవ్యంః డిజిపి జితేందర్

మెదక్ ప్రతినిధి, జ‌న‌వ‌రి 23 సిరి న్యూస్ః
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని డిజిపి జితేందర్ అన్నారు. గురువారం నాడు జిల్లా పోలీస్ ఆఫీస్ లో కవాతు ప్రాంగణం, సెల్యూట్ బేస్ ను ఆవిష్కరించడానికి మెదక్ జిల్లాకు విచ్చేసిన డిజిపి డాక్టర్ జితేందర్ కు పుష్పగుచ్చంతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిలు పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు అనంతరం సెల్యూట్ బేస్ ప్రాంగణాన్ని శిలాఫలకంతో ప్రారంభించారు. తదుపరి పోలీస్ కవాతు లో పాల్గొన్న డిజిపి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మెదక్ జిల్లాకు మంచి పరేడ్ గ్రౌండ్ రావడం శుభ సూచికమని అన్నారు. పోలీస్ సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా మీకోసం నేనున్నానని అన్నారు. పోలీసులకు క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. తమ శాఖకు సంబంధించిన ప్రతి విషయన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నానని సరెండర్ లివులు బిల్లుల కోసం 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఆరోగ్య భద్రతకోసం కూడా 75 కోట్లు విడుదలైనట్లు డిజిపి తెలిపారు. మీకోసం నేనున్నాను అని మెదక్ పోలీస్ శాఖకు భరోసా కల్పించారు. జిల్లాలో కొత్త మండల కేంద్రాలలో పోలీస్ స్టేషన్లు ఏర్పాటుకు చర్యలు చేపడుతామని అన్నారు.

ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ పోలీసులు క్రమశిక్షణ గల పోలీసులుగా పేరు సంపాదించుకున్నారన్నారు. రాష్ట్ర ప్రజల శాంతిభద్రత పరిరక్షణ విషయంలో పోలీసులు ఎల్లవేళలా కృషి చేస్తున్నారని, ప్రజల ఆకాంక్ష మేరకు పోలీసులు విధి నిర్వహణలో కొనసాగిస్తున్నారన్నారు. నక్సల్స్ సమస్య, నార్కోటిక్ డ్రగ్స్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నమని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉందని, టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కేసులను త్వరితన ఛేదించేందుకు కృషి చేస్తున్నమన్నారు. పోలీస్ శాఖకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరిగిన వందకు డయల్ చేయాలి రాష్ట్ర ప్రజలకు సూచించారు.

అర్బన్ ఏరియాలో 10 నిమిషాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 15 నిమిషాలు సంఘటన ప్రదేశానికి చేరుకుంటారని తెలిపారు. పోలీసుల సేవలు ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, 100కు డయల్ సేవలందించేందుకు 2000 వాహనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సైబర్, డిజిటల్ క్రైమ్ గురి ఆయితే వెంటనే 1930 కాల్ చేయాలని అని చెప్పారు. సైబర్ క్రైమ్ తో 180 కోట్ల రూపాయలు రికవరీ చేశామని, 300 కోట్లను వేరే అకౌంట్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నమని తెలిపారు. పోలీస్ శాఖలు ఖాళీగా ఉన్న పోస్ట్ లు ప్రభుత్వం భర్తీ చేయాలని ఉద్దేశంతో ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ 24 గంటలు సేవలందిస్తుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, మల్టీ జోన్ ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐజీపి యం.రమేష్ తో పాటు పలువురు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.