పొగ మంచుతో జరభద్రం..! రహదారులకు కమ్మేస్తున్న మంచు

Smoke and snow are safe..! Snow on the roads
Smoke and snow are safe..! Snow on the roads

గుమ్మడిదల : రహదారులను పొగ మంచు కమ్మేస్తున్నది. శుక్రవారం ఉదయం రహదారి పైన పారిశ్రామికవాడలో ఉదయం నుండి పొగ మంచు కమ్మేయడం వలన వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. ప్రయాణం కష్టంగా మారింది. మంచు తెరను చీల్చుకొని వాహనదారులు రోడ్డుపైన ప్రయాణం చేయడం ప్రమాదంతో కూడిందని వాహనదారులు అంటున్నారు. వర్షాన్ని తలపించే విధంగా మంచు ఏర్పడింది. ఉదయం 9 గంటల వరకు కూడా మంచు కమ్ముకొని ఉంది. ప్రధాన రహదారుల గుండా మంచు కమ్మేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రయాణికులు చూచిపోవలసిన అవసరం ఎంతైనా ఉంది మండల కేంద్రమైన గుమ్మడిలలోని పారిశ్రామిక అవార్డులో మంచు పడుతున్న విషయాన్ని అనువుగా తీసుకొని పరిశ్రమల నుండి వాయు కాలుష్యాన్ని బయటకు వదిలిస్తున్నారు దీంతో పొగ మంచుతోపాటు వాయు కాలుష్యం పొగతో నిండిపోవడం వల్ల ప్రధాన రహదారి గుండా పోయే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాలలో పొగ మంచు ఇండ్లను సైతం కమ్మి వేసినది. వాహనదారులు పొగ మంచు విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని రోడ్డుపై ప్రయాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.