మూడవరోజు నల్లవల్లిలో ఆందోళన
కొనసాగుతున్న పోలీస్ పహారా
సిరి న్యూస్ /గుమ్మడిదల రూరల్[Gummadidala rural]
పచ్చని చెట్ల మధ్య హాల్లాదకరమైన వాతావరణంలో ఉండే గ్రామాలు ఒక్కసారిగా కలుషిత వాతావరణంలో మారుతున్నాయి. గుమ్మడిదల మండలంలోని ప్యారా నగర్ నల్లవల్లి కొత్తపల్లి మంబాపూర్ గుమ్మడిదల గ్రామాలకు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో దుర్గంధపూరితమైన వాసన రావడంతో ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఒక వైపు కలుషితమైన పరిశ్రమను ఏర్పాటు చేయడంతో వాయు కాలుష్యముతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ అందులో ఈ కలుషిత వ్యర్ధ పదార్థాలను తీసుకోవచ్చి డంపింగ్ యార్డ్ లో వేయడం మూలంగా ఇక్కడ ప్రజల ఆరోగ్యం ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి అయినా ప్రజలు ఆందోళన చేస్తున్న పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
పచ్చని చెట్ల మధ్య ఉండే గ్రామం
పచ్చని చెట్లు పంట పొలాల మధ్య ఉండే ప్యారా నగర్ నల్లవల్లి కొత్తపల్లి గ్రామాలు డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో కలుషిత వ్యర్థ పదార్థాల మధ్య కూరుకుపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. డంపు యాడ్ చుట్టుపక్కల ఉండే వ్యవసాయ పంట పొలాల్లో పనులు చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుందని రైతులు వాపోతున్నారు. డంప్ యాడ్ నుంచి వచ్చే దుర్వాసనతో పాటు పొగ నిండిపోతుందని ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ ఏర్పాటు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతినిత్యం ఈ ప్రాంతం నుండి మార్కెట్ కు పలు రకాల కూరగాయలు సాగు చేసి పంపించడం జరుగుతుంది. పంట సాగు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లవల్లిలో గ్రామస్తులు ఆందోళన
డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా నల్లవల్లి గ్రామంలో మూడోరోజు గ్రామస్తులు ముకుమ్మడిగా ఆందోళనకు దిగినారు చిన్న పెద్ద అను తేడా లేకుండా అందరూ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు డంపింగ్ యార్డ్ ఏర్పాటు జరిగితే మా బతుకులు ప్రశ్నార్థకంగా మారుతాయని గ్రామస్తులు వాపోతున్నారు.
కొనసాగుతున్న పోలీస్ పహారా
గత మూడు రోజులుగా పోలీస్ పహారా కొనసాగుతూనే ఉంది గుమ్మడిదల మంబాపూర్ నల్లవల్లి బస్టాండ్ తో పాటు డంపింగ్ యార్డ్ కు పోయే దారిలో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. ఈ చిన్న సంఘటన జరిగిన అక్కడికి పోలీసులు చేరుకుంటున్నారు. నల్లవల్లి గ్రామంలో పోలీసులు తిరగడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నామని వాపోయారు.
మండల ప్రజలు ఆందోళన చేస్తున్న
ప్రాణాలు తీసే ఈ డంపింగ్ యార్డ్ వద్దు బాబోయ్ వద్దు అంటూ గుమ్మడిదల మండల ప్రజలు ముక్తకంఠంతో ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి చలనం కనిపించడం లేదు. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న డంపింగ్ యార్డ్ పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
ఎయిర్ ఫోర్స్ అధికారులకు వినతి
డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకు పక్షులకు ఆరోగ్యపరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గుమ్మడిదల రైతు సంఘం అధ్యక్షులు అమ్మగారి సదానంద రెడ్డి రైతులతో ఎయిర్ ఫోర్స్ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు జరుగుతే ఈ ప్రాంతానికి పలు రకాల పక్షులు రావడం మూలాన ఫ్లయింగ్ అయ్యే ఎయిర్ క్రాఫ్ట్ కు ఇబ్బందులు ఎదురవుతాయని వారు వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు