చైనా మాంజా అమ్మితే క్రిమినల్ చర్యలు.

Selling China Manja is a criminal act.
Selling China Manja is a criminal act.

 పెద్ద శంకరం పేట, (సిరి న్యూస్):
మండలంలో ఎక్కడైనా చైనా మాంజ అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్థానిక ఎస్ ఐ శంకర్ హెచ్చరించారు. సోమవారం నాడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన పట్టణం లోని పలు దుకాణాలు తనిఖీ చేసి చైనా మాంజ, నైలాన్ మాంజ అమ్మే విషయాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అందరూ సుఖ శాంతులతో జరుపు కొవాలని అన్నారు. ఎక్కడ కూడా పతంగుల కూ చైనా మాంజ వాడకూడదని అన్నారు. దీని వల్ల మనుషులకే కాకుండా పక్షులకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ఎక్కడ ఈ మాంజ అమ్మినా తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమములో పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.