-సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి [sangareddy] :మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి, కుల వివక్ష, పితృస్వామిక పీడనలపై పోరాడిన వీరనారి, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు.శుక్రవారం సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పూలె దంపతుల సేవలను త్యాగాలను గుర్తు చేసుకున్నారు.కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు మండల పార్టీ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.