నారాయణఖేడ్[Narayankhed] ఫిబ్రవరి 7 (సిరి న్యూస్)
రైతుల బాధలు అంతా ఇంత కాదు. విత్తు నాటిన నుండి పంట చేతికి వచ్చే వరకు రైతు పడని పాట్లు ఉండవు తుర్కపల్లి, గ్రామానికి చెందిన రైతు భూమా గౌడ్, తన పంట పొలానికి హైదరాబాదు నుండి పాత చీరలు అమ్మే వాళ్ళ వద్ద పది రూపాయలకు ఒక చీరను తీసుకువచ్చి పందులు కోతుల, రక్షణ కోసం పంట చుట్టూ చీరలను కట్టాడు. మొలకబెత్తిన నుండి పంట కోసే వరకు జంతువులతో నాన్న తిప్పల పడుతుంటారు రైతులు ఓ పక్క అడవి పందులు, కోతులు, పిట్టలు వీటి నుండి కాపాడుకోవడం ఆ తరువాత చీడపీడల నుండి రక్షించుకోవడం ఇవన్నీ అయ్యేసరికి రైతుకు చివరకు పెట్టుబడే మిగులుతోందని రైతు భూమా గౌడ్ తెలిపారు.