జనవరి 11 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.
సంగారెడ్డి [sangareddy]పట్టణంలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి.విద్యార్థుల సాంప్రదాయ నృత్యాలతో వేడుకలు ప్రారంభించారు. ముచ్చటైన ముగ్గులతో, చిరునవ్వుల చిందించే వదనంతో చిన్నారులు పతంగులను చేసి పాఠశాల ఆవరణలో అలంకరించారు. ప్రతి తరగతి ముందు చక్కని రంగవల్లులతో చూడముచ్చటైన ముగ్గులు వేసి పండుగ పట్ల వారి ఆసక్తిని తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు భిన్నత్వంలో ఏకత్వం చాటే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు విద్యార్థులకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో పాఠశాల చెర్మెన్ శ్రీ ఈదర ఆంథోనీ రెడ్డి గారు, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రవికుమార్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.