పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి [sangareddy] టౌన్, జనవరి 15(సిరి న్యూస్)
సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఉత్సాహంగా పతంగులు ఎగరవేశారు. సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తోందని అన్నారు. రైతులకు మంచి చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి నర్సింలు, జీవి శ్రీనివాస్, విఠల్, శ్రవణ్ రెడ్డి, వాజిత్, అజిమ్, చింటు తదితరులు పాల్గొన్నారు.