పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో సంకినేని మధుసూదన్ రావు

Sankineni Madhusudan Rao is a graduate MLC
Sankineni Madhusudan Rao is a graduate MLC

ఫిబ్రవరి 5 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం( SGTU) వ్యవస్థాపక అధ్యక్షులు సంకినేని మధుసూదన్ రావు గారు కరీంనగర్ ,మెదక్, నిజాంబాద్, అదిలాబాద్ ఉమ్మడి నియోజకవర్గ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారని యస్ జి టి యు,రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కరివేద మహిపాల్ రెడ్డి మరియు అరికల వెంకటేశం గారు తెలియజేశారు.శ్రీ సంకినేని మధుసూదన్ రావు గారు ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలకు పైగా సేవలందించి మంచి పేరు సాధించారు.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల రక్షణ కొరకు నాణ్యమైన విద్య అందించాలనే తపనతో ఎస్ జి టి యూనియన్ స్థాపించి, గత ప్రభుత్వ హయాంలో నోషనల్ ఇంక్రిమెంట్ సాధించడంలో మరియు పాఠశాల సర్వీస్ పర్సన్స్ నియమించడంలో విశేషంగా కృషిచేసి సాధించారు.అలాంటి నిజాయితీ ,నిర్మలత్వం కలిగిన వ్యక్తిని మనమందరం కలిసి శాసనమండలిలో ఎస్ జి టి యు, గొంతు వినిపించడానికి పాఠశాలల, ఉపాధ్యాయుల సమస్యలను నివారించి నాణ్యతను పెంపొందించడం కొరకు మరియు ప్రైవేటు కాంట్రాక్టు, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం, నిరుద్యోగ సమస్యను నిర్మూలించడం కొరకు ,పి ఆర్ సి లో వేతన వ్యత్యాసాలను ప్రాథమిక ప్రాథమికోన్నత ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించడం కొరకు, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించడం కొరకు,ప్రతి పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడిని పోస్ట్ ఉండేటట్లుగా మొదలగు అనేక అనేక సమస్యలను సమాధానాలు సాధించడం కొరకు శాసనమండలిలో అడుగుపెడతామని పేర్కొకొన్నారు.

పట్టభద్రుల ఎన్నిక జరిగే 13 జిల్లాల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘానికి బలమైన క్యాడర్ ఉందని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పేర్కొన్నారు.అదేవిధంగా వివిధ సంఘాల మద్దతు రాష్ట్రస్థాయిలో, జిల్లాల స్థాయిలో కోరడం జరిగింది. అనేక సంఘాలు మద్దతు కూడా తెలియజేశారు.ఈనెల 07 తేదీన నామినేషన్ వేస్తున్నట్లు పేర్కొన్నారు.అందరి ఆదరణ పొందే విధంగా మండలిలో ప్రశ్నించేగొంతు గా ఉంటానని 13 జిల్లాల్లో ఉన్న ఉపాధ్యాయ సోదరులందరూ కూడా శక్తి వంచన లేకుండా నా విజయానికి కృషి చేస్తున్నారని మధుసూదన్ రావు గారు తెలియజేశారు.