ఫిబ్రవరి 6 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
నెహ్రూ యువ కేంద్ర – మై భారత్ సంగారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, సర్దార్ పటేల్ యివజన సంఘం సంయుక్తంగా భారత ప్రభుత్వం, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్, షెటిల్ బ్యాడ్మింటన్, క్రీడా పోటీలు (పురుషుల మరియు మహిళా) యూత్ కేటగిరీ అండర్ 14-29years మాత్రమే , సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం నందు , షెటిల్ బ్యాడ్మింటన్ కలెక్టరేట్ ఇండోర్ స్టేడియం నందు 10, 11 తేదీల్లోనిర్వహించడం జరుగుతుంది, సంఘం అధ్యక్షుడు శేష్వంత్ గౌడ్ , జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్షి అనంత్ రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మచ్చేందర్ మాట్లాడుతూ, జిల్లా లో ఉన్న కబడ్డీ,వాలీబాల్, బ్యాడ్మింటన్ కి సంభందించినటువంటి క్రీడాకారులు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు మరియు పాల్గొనదల్చుకున్న క్రీడా జట్లు నమోదుకు సంప్రదించాల్సిన నంబరు:- 9985351111.