– శిథిలావస్థలు చెరువులు

Ruined ponds
Ruined ponds

– మట్టితో నిండిన కాలువలు
– చెరువు కట్టలపై పిచ్చి మొక్కలు
– పట్టించుకోని అధికారులు
– మరమ్మత్తుల కోసం ఎదురుచూపులు
ఝరాసంగం[Jharasangam], ఫిబ్రవరి 6 సిరి న్యూస్ :
రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ప్రతి ఏటా వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు
చెరువులు కుంటలు నీటితో నిండుకుంటున్నాయి. కానీ నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు అవస్థలకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరా సంగం మండలం వ్యాప్తంగా ఏడాకులపల్లి లో కొత్తూరు వాగు, రాళ్ళ వాగు చెరువుల. మేదపల్లి శివారులో గుండం చెరువు, ఏనుగుల చెరువు,
ఈదులపల్లిలో కప్పలగా వాగు చెరువు, రాచన్న వగు చెరువు, గంగాపూర్ లో ఒక్క చెరువులు ఉన్నాయి. ఆయా చెరువులు కింద 2 వెలు ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంటుందనీ అధికారుల లెక్కలు ఉన్నాయి. కానీ వాటి తూములు, సీసీ కాలువలు శిధిలావస్థకు చేరడంతో కనీసం 2 వందల ఎకరాలు కూడా నీరు చేరడం లేదు. పుష్కలమైన నీటి వనరులు ఉన్నప్పటికీ రైతులు పండించే వివిధ రకాల పంటలకు నీరు అందకపోవడంతో ఆయా గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.ఝరాసంగం మండల వ్యాప్తంగా ఉన్న 7 పెద్ద చెరువులకు ఉండగా పొట్టి పల్లి బర్దిపుర్, చిల్కపల్లి, చిలేపల్లి, ఎల్గోయి తదితర గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు ఉన్నాయి. వాటి తూములు శిథిలావస్థకు చేరుకోగా మంటి కాలువలు ఉండటంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు చేరడం లేదు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు గ్రామస్తులు పలుమార్లు చెరువుల మరమ్మత్తులు చేయాలని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెరువులకు సంబంధించిన కాలువలను, తుములను మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు.

– వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి: ఎన్. సంగమేశ్వర్ రైతు మేదపల్లి……
ఏనుగుల చెరువును గత 50 సంవత్సరాల క్రితమే నిర్మించారు, చెరువు క్రింద ఒక్క 107 ఎకరాల ఆయకట్ట ఉంది. ఈ చెరువు ద్వారా 27 ఎకరాలకు మాత్రమే సాగుకు నోచుకుంటుంది. చెరువు మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో చెరువులో ఉన్న నీరు కూడా ఉపయోగపడడం లేదు. ప్రస్తుతం ఈ చెరువు పరిస్థితి శిధిలావస్థకు చేరుకుంది. చెరువుకు సంబంధించిన తూము పనిచేయడం లేదు దయచేసి చెరువు మరమ్మతులు చేపట్టి నూతన తూమును నిర్మించండి.