రోడ్ భద్రత అందరీ సమిష్టి బాధ్యత

Road safety is everyone's collective responsibility
Road safety is everyone's collective responsibility

ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ [Collector Rahul Raj]
సిరి, మెదక్ టౌన్ [Medak Town] :
రోడ్డు భద్రత నియమాలు పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. బుధవారం నాడు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాలలో వివిధ పాఠశాలల విద్యార్థులకు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలిని కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పీ, ఉదయకుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టరు రాహుల్ రాజ్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిలు రోడ్ భద్రత నియమాలు సంబంధించి ప్లా కార్డులు పట్టుకుని జూనియర్ కళాశాల నుండి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణకు ‌ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై “ట్రాఫిక్ నిబంధనలు పాటించండి ప్రమాదాలను అరికట్టండి” “హెల్మెంట్ ధరించడం మన ప్రాణానికి ఎంతో రక్షణ” విద్యార్థినీ విద్యార్థుల నినాదాలతో పురవీధులు మారుమోగాయి, ‌ర్యాలీ ప్రజల్లో చైతన్య దిశగా కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని ప్రాణం చాలా విలువైనదని ‌ రోడ్ భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు… మోటార్ సైకిల్ మీద ప్రయాణిచ్చే ప్రతి ఒక్కరు తప్పకుండ హెల్మెట్ ను ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, అతివేగం, ఓవర్ టేకింగ్ చెయ్యరాదని చెప్పారు. తల్లితండ్రుల చేతుల్లో విద్యార్థుల భవిషత్తు ఉంటుంది అన్నారు. రోడ్ భద్రత నియమాలు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి వివిధ పాఠ్యాంశంగా చేర్చారని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం కచ్చితంగా ఎడమవైపు నుండి వెళ్ళాలని కోరారు. సినిమాలో మాదిరిగా యువకులు స్టoట్స్ వేస్తూ బైక్ విన్యాసాలు చేయద్దన్నారు.ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ….
యుద్ధంలో మరణించిన దానీ కంటే కూడా రోడ్ ప్రమాదాలలో మరణించే వారి సంఖ్య ఎక్కువ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టూడెంట్ లైఫ్ నుండి రోడ్ భద్రత నియమాలు పాటించాలని కోరారు. రోడ్ ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్ తరలించాలని కోరారు…
స్కూల్ లో పాఠాలు నేర్చుకునేటప్పుడే రోడ్డు భద్రత నియమాలు నేర్చుకోవాలని కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాల కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా 20% మరణాలు జిల్లాలు తగ్గాయి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్. వెంకటస్వామి, ఆర్ అండ్ బి
ఈఈ‌ సర్దార్ సింగ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎంఈఓ నీలకంఠం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీలేఖ, శ్రీనివాస్
సంబంధిత అధికారులు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.