బి ఎల్ ఓ ల పెండింగ్ గౌరవ వేతనాలు విడుదల చేయండి…..

Release the pending honorarium of BLOs…..
Release the pending honorarium of BLOs…..

బి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం*
శివంపేట్[shivampet] జనవరి 25 (సిరి న్యూస్ )
శివ్వంపేట మండలంలో బి ఎల్ ఓ లు గా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ల పెండింగులో వున్న గౌరవ వేతనాలను విడుదల చెయ్యాలని స్థానిక తహసీల్దార్ కమలాద్రి గారిని బి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం కలిసి వినతిపత్రం ఇచ్చారు.. ఈ సందర్బంగా మాట్లాడుతూ చాలిచాలని వేతనాల తో బి ఎల్ ఓ లుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు గత సంవత్సర కాలంగా గౌరవ వేతనాలు మంజూరి కాలేదని,అధిక పనిభారం ఉన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు బి ఎల్ ఓ లుగా పనిచేస్తున్నారని అన్నారు.వారికి సకాలంలో గౌరవ వేతనాలు విడుదల చేయక పోవడం వలన వారు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుoటున్నారని తెలిపారు.అందువల్లన బి ఎల్ ఓ ల పెండింగులో ఉన్న గౌరవ వేతనాలను వెంటనే విడుదల చెయ్యాలని మరియు వారి గౌరవ వేతనాలను నెలకు 8,000/- రూపాయలుగా పెంచి చెల్లించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మంజూరి చేయించాలని విజ్ఞప్తి చేశారు.