ధరాఖాస్తులు తీసుకునే వారు లేక భాధన వెల్లబుచ్చుకున్న వికలాంగుడు
ప్రత్యేక అధికారి ఇలా వచ్చారు అలా వెళ్లారు…..
ఝరాసంగం[Jharasangam] జనవరి 21 సిరి న్యూస్:
మండల పరిధిలోని మాచ్నూర్, కప్పాడ్, నర్సాపూర్, క్రిష్ణాపూర్ తదితర గ్రామాల్లో మంగళవారం గ్రామ సభలు నిర్వహిచారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో అధికారులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు చదివి వినిపించారు. రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇళ్ళ కు సంబంధించిన లిస్ట్ లో పేర్లు లేని వారు తిరిగి ధరాఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో అధికారులకు పలు పథకాలపై ప్రజలు ప్రశ్నించారు. మాచ్నూర్ కొనసాగిన గ్రామ సభల్లో అధికారుల పనితీరు పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రాక ముందు నుంచి వినతి పత్రాలను ఇద్దామనుకుంటే పట్టించుకునే వారే లేరని పలువురు వాపోయారు. మండల పరిధిలోని కృష్ణాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు ట్రేనీ కలెక్టర్ మనోజ్ హాజరయ్యారు. నాలుగు పథకాలకు సంబంధించిన పలు వినతి పత్రాలను ఆయన స్వీకరించారు.ప్రత్యేక అధికారి ఇలా వచ్చారు అలా వెళ్లారు…రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలపై చేపడుతున్న గ్రామ సభలపై అధికారులు అశ్రద్ధ చూపుతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మూడు రోజులపాటు గ్రామసభలు నిర్వహించి ప్రజల వినతులను పరిష్కరించాలని ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఝరాసంగం మండల ప్రత్యేక అధికారి మాత్రం మాచ్నూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దగ్గర ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అధికారి ఆ విధంగా వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించారు.ఎవ్వరు పట్టించుకోవడం లేదు……లాజర్, వికలాంగుడు మాచూనూర్ ఇందిరమ్మ ఇళ్ళు కోసం గతంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ లిస్ట్ లో తమ పేరు రాలేదు. ఇప్పుడైనా గ్రామసభలో తమ దరఖాస్తును అందజేద్దామనుకుంటే వికలాంగుడునైన తనను ఎవరు పట్టించుకోవడం లేదు. ఉండేందుకు ఇల్లు లేకపోవడంతో తమ కుటుంబం చాలా ఇబ్బందులు గురవుతున్నామని ఆయన బాధను వెళ్ళబుచ్చాడు.