చేగుంట,[chegunta] జనవరి 15(సిరిన్యూస్)ః
మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను చేగుంట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మాసాయిపేట మండలం రామంతాపూర్ గ్రామంలో ఇటీవల ఓ మతిస్థిమితం లేని మహిలపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సీసీటీవి పుటేజీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రామాయంపేట సి.ఐ వెంకట రాజాగౌడ్ దర్యాప్తు చేపట్టగా తూప్రాన్‌కు చెందిన సయ్యద్ అప్రోజ్, చేగుంటలో వాహన హెల్పర్‌గా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన సోహెల్, చేగుంట నివాసి గౌరీ బస్వరాజ్‌లను నిందితులుగా గుర్తించ అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిని బుధవారం కోర్టు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసును త్వరగా చేధించినందుకు చేగుంట ఎస్.ఐ శ్రీచైతన్యకుమార్‌రెడ్డిని, సిబ్బందిని సీఐ అభినందించారు.