బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ దిష్టిబొమ్మ దహనం

rally-effigy-burnt-in-protest-against-bandi-sanjays-inappropriate-comments
rally-effigy-burnt-in-protest-against-bandi-sanjays-inappropriate-comments

బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
జనవరి 28 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి[sangareddy].
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు బహుజన సంఘాల ఆధ్వర్యంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఐబి నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీగా బండి సంజయ్ దిష్టిబొమ్మను ఊరేగిస్తూ చెప్పులతో కొడుతూ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బైండ్ల అశోక్ కుమార్, జిల్లా ఆర్గనైజ్ సెక్రెటరీ పోతురాజు పవన్ మరియు బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్, బహుజన నాయకులు ఎం.అనంతయ్య, బి. నాగయ్య, ఎం. విజయరావ్,డివిఎంసి మెంబర్ కాషాపాగా ఇమ్మయ్య,గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయపాల్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రాథోడ్ మాట్లాడుతూ దొరల ఆకృత్యాలపై పోరు దులిపి, భూస్వాములపై తిరుగుబావుట కై గల మెత్తి, పెత్తందారుల అణిచివేతలపై ఆకలి పొద్దుహై నిలిచిన ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచిన గద్దర్ అన్న గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ కి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన రీతిలోనే సమాధానం ఇవ్వడంతో పాటు, నోరును, ఒళ్ళును జాగ్రత్త కాపాడుకోవాల్సిందిగా లేనిపక్షంలో తెలంగాణలో బిజెపి పతనం ఆరంభమైందని సంకేతాలు ఈ సందర్భంగా పంపడం జరుగుతుంది, ఇకనైనా బిజెపి వాళ్లు మనువాద భావజాలాన్ని పక్కనపెట్టి ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు కట్టుబడి పని చేయాలి తప్ప ప్రజల మెప్పు పొందిన ప్రజా ఉద్యమ నాయకులపై నూరు జారితే నాలిక కోయడానికి కూడా సిద్ధమే అని బండి సంజయ్ కి బిజెపి వాళ్లకు హెచ్చరిస్తున్నాం అని ఈ సందర్భంగా తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్షులు సురేష్, టి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్, అంబేద్కర్ యూత్ సంఘం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పురుషోత్తం, మన్నేసాగర్ మాజీ సర్పంచ్,జిల్లా కార్యదర్శులు జోగ్యల్ల రాజు, బసవరాజ్, తలారి సురేష్, లక్ష్మణ్, ప్రభాకర్, భక్కి బాలు, పవన్,మోహన్ రాజ్ , బి నగేష్,బి రమేష్ తదితరులు పాల్గొన్నారు.