విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

Quality food should be provided to the students
Quality food should be provided to the students

-నూతన డైట్ మెనూ ప్రకారం వంటలు చేయాలి
-వార్డెన్, కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం తగదు
-సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్
– విద్యార్థులకు అందించిన సరుకులను అమ్ముకోవడం పై మండిపాటు
– డైట్ మెనూ ప్రకారం వంటలు చేయకపోవడం ప‌ట్ల‌ ఆగ్రహం

సిద్ధిపేట, జ‌న‌వ‌రి 7 సిరి న్యూస్
సిద్ధిపేటరెసిడెన్షియల్ పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో ముస్తాబాద్ చౌరస్తా వద్దనున్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో డైట్ మెనూ ప్రకారం మంగళవారం విద్యార్థులకు పెట్టాల్సిన వంటలను వంట చేయలేకపోవడం పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డెన్ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగాసిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ మాట్లాడుతూ వార్డెన్ కాంట్రాక్టర్ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్ నామ్ చేసేలా కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రజలు తీర్పును ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కొందరు కాంట్రాక్టర్లు అధికారులు వార్డెన్లు టిఆర్ఎస్ నాయకులకు తొత్తుల్లాగా వ్యవహరిస్తూన్నారు అని అన్నారు. బిఆర్ఎస్ నాయకుల కనుచూపుమెరలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది వార్డెన్లు వారు తీరును మార్చుకోకుంటే మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తామని హెచ్చరించారు.
పేద విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు అన్ని రకాల సరుకులను ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. కానీ వార్డెన్లు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రభుత్వం అందించిన సరుకులను అమ్ముకొని డబ్బులు కూడా పెట్టుకుంటున్నారు అని మండిపడ్డారు. ఇప్పటికైనా వార్డెన్ కాంట్రాక్టర్ తమ బుద్ధి మార్చుకొని విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న నూతన డైట్ మెన్ ప్రకారం వంటచేసి విద్యార్థులకు అందించాలని లేకపోతే ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మంచి భోజనం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజు పడే ప్రసక్తి లేదని అన్నారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు సిద్దిపేటలో ఉన్న హాస్టల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్న వార్డెన్ కాంట్రాక్టర్లపై ఉన్నతాధికారులు చొరవ తీసుకొని వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని అన్నారు. 10 సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల వారిని మోసం చేసిన టిఆర్ఎస్ నాయకుల భ్రమల నుండి కొమ్ముకాస్తున్న పలువురు అధికారులు బయటకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మహిళ ముద్దం లక్ష్మి ,బుచ్చిరెడ్డి , గుర్రం శ్రీనివాస్ రెడ్డి పాండు , కలీం ఉద్దీన్ ,గయ్యాజుద్దీన్ , అక్బర్ ,చోటా అజ్మత్ , చంది రెడ్డి రాజశేఖర్ రెడ్డి, కవిత ,వనజ, సాంబమూర్తి తదిరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు