ఆకుల ప్రభాకర్
జిల్లా అధ్యక్షులు
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం
సిరి హత్నూర[Hathnoora], జనవరి 28:
మండలం లోని కొన్యాల ఎంపీపీ ఎస్, హత్నూర పాఠశాలల్లో నిరసన పత్రాల దగ్ధం కార్యక్రమం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ జి టి యు జిల్లా అధ్యక్షులు ఆకుల ప్రభాకర్ మాట్లాడుతూ
భారత ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు చేయనున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ఉద్యోగులకు నిర్ధారిత పెన్షన్ హామీ ఇచ్చినట్లుగా కనిపించినా, ఇందులో పలు లోపాలు మరియు అవిశ్వాస అంశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది అని UPS పథకం అమలైతే ఉద్యోగుల భవిష్యత్తు ఆర్థిక భద్రతకు పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న CPS/NPS ( నూతన పెన్షన్ స్కీం) రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యోగ , ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ యుపిఎస్ అంటూ ముందుకు వస్తుంది. కావున మన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో యుపిఎస్ కు మద్దతు తెలుపవద్దని వారు అన్నారు.
ఈ UPS/ CPS / NPS లు మాకు వద్దు మాకు కావాల్సింది కేవలం OPS( ఓల్డ్ పెన్షన్ స్కీమ్) అంటూ MPPS కొన్యాల , మండలంలో UPS వద్దు OPS ముద్దు అంటూ పత్రాల్ని దగ్ధం చేశారు . ఈ కార్యక్రమంలో TSCPSEU జిల్లా కార్యదర్శి రవీందర్ యాదవ్ మరియు ఉపాధ్యాయులు రమేష్ ,లక్ష్మీ, సుమలత నిరసన తెలిపారు