– పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.
సిరి న్యూస్ కొల్చారం….ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా విద్యారంగానికి, ఉపాధ్యాయులకు ఇచ్చిన చాల హామీలు నేటికీ నెరవేర్చకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగులకు హామీలను నెరవేర్చాలని టి పి టి ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు యాదగిరి డిమాండ్ చేశారు. ఈ రోజు కూల్చరం మండలములో పలు పాఠశాలలను సందర్శిస్తూ సమస్యల సేకరణ చేశారు.స్థానిక కుల్చారం ఉన్నత పాఠశాలలో కాలమణిని ఆవిష్కరించడం జరిగింది.ఎన్నికల మేనిఫెస్టోలో ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిన ప్రకారం రెండు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న అన్ని రకాల బిల్లులను సత్వరమే విడుదల చేయాలని, ఇకనుంచి ఎప్పటి బిల్లులు అప్పుడే చెల్లించాలని, ఉద్యోగ విరమణ పొందిన వారికి ఇవ్వాల్సిన చెల్లింపులు వెంటనే అందజేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
జి.ఓ.317 వల్ల స్థానికత కోల్పోయిన అందరిని బేషరతుగా సొంత జిల్లాలకు పంపాలని, పెండింగులో ఉన్న డి. ఏ. లను విడుదల చేయాలని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పి.ఆర్.సి. అమలు చేస్తామన్న, సీపీఎస్ ను రద్దు చేస్తామన్న వాగ్దానాన్ని ఇప్పటికైనా నిలుపుకోవాలని, విద్యారంగానికి బడ్జెట్ లో 15 శాతం నిధులు కేటాయించి పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, రాష్ట్ర కౌన్సిలర్ సంగయ్య, మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగం గౌడ్, పిండి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.