ప్రారంభోత్సవానికి సిద్ధంగా ప్రియాంక కాలనీ పోచమ్మ దేవాలయం

priyanka-colony-pochamma-temple-ready-for-inauguration-2

-ఈనెల 30,31.వ తేదీలలో ప్రతిష్టాపన ఉత్సవ కార్యక్రమాలు..
-సర్వాంగ సుందరంగా ఆలయం ముస్తాబు..

పెద్ద శంకరంపేట : పెద్ద శంకరంపేట పట్టణ కేంద్రంలోని ప్రియాంక కాలనీలో ఈనెల 31న జరుగునున్న పోచమ్మ దేవాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక కాలనీ కమిటీ విద్యుత్ దీప కాంతులతో నూతన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. గత కొన్ని నెలలుగా ప్రియాంక కాలనీ కమిటీ ఆధ్వర్యంలో దాతల ద్వారా విరాళాలను సేకరించి వేగవంతంగా ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణం పూర్తవడంతో ఈ నెల 30 నుండి వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈనెల 30 నుండి గణపతి పూజ, పుణ్యాహవచనము, వరుణ పూజ, అఖండ దీపారాధన, నవగ్రహ పూజ, చతు షష్టి వాస్తు, క్షేత్ర పాలక సర్వ శోభద్ర, మండల దేవత పూజలు, అగ్ని ప్రతిష్టాపన, కార్యక్రమాలు నిర్వహించనున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. 31వ తేదీ శుక్రవారం నాడు యంత్ర ప్రతిష్టాపన, అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన, జరుగుతుందని చెప్పారు. 31 నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు పిలుపునిచ్చారు.