ధ‌ర‌లు వెల వెల‌.. రైతులు విల విల‌

Prices are expensive.. Farmers are expensive
Prices are expensive.. Farmers are expensive

న‌ష్టాల బాట‌లో ట‌మాట రైతు
కిలో ఐదు రూపాయలు ప‌లుకుతున్న ధ‌ర
పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే ప‌రిస్థితి లేద‌ని ఆవేద‌న
స్టోరేజ్ సౌకర్యం లేక ఇబ్బందులు..
పొలంలో కోయకుండా వదిలేసిన కొంద‌రు రైతులు
ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి
గుమ్మడిదల,[Gummaḍidala]
జ‌న‌వ‌రి 16 సిరి న్యూస్ః
ఇంతకన్నా అన్నదాతలకు దుర్భరసితి ఉంటుందా ..వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మూడు నెలలు కష్టపడి పండిస్తే టమాట ఇచ్చిన ఫలితం ఇది కారణం ధర లేకపోవడం 20 కిలోల పెట్టే 100 నుండి 150 రూపాయలు పలుకుతుంది అంటే కిలో ఐదు రూపాయల చొప్పున పోతున్నట్లు లెక్క ధర లేక టమాటలను తెంపలేక పంట పొలంలోనే రైతులు వదిలేస్తున్నారు గుమ్మడిదలమండల పరిధిలో నల్లవల్లి కొత్తపల్లి కానుకుంట రామ్ రెడ్డి బాయ్ వీరారెడ్డిపల్లి గుమ్మడిదల గ్రామాలలో రైతులు తన పంట పొలాల్లో టమాటా సాగును అధిక సంఖ్యలో సాగు చేశారు ప్రస్తుతం పంట చేతికి వస్తున్న సమయానికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు ఈ నెల రోజుల నుండి టమాట పంటకు సరైన ధర లభించడం లేదు దీంతో రైతులు చేతికి వచ్చిన పంటను చేన్లోనే వదిలేస్తున్నారు కొన్నిచోట్ల పారపోస్తున్నారు. కనీసం పంటను సాగు చేసేందుకు అయిన ఖర్చు కూడా రావడం లేదు దీంతో రైతులను పంట చేనులోనే వదిలేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో కిలో ధర ఐదు రూపాయలు మాత్రమే పలుకుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ కూలీలను పెట్టి టమాట పంటను తెంపుతే కూలీలు కూడా వెళ్లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకొని టమోటా ధరకు సరైన ధర కల్పించాలని రైతులు వాపోతున్నారు.
స్టోరేజ్ సౌకర్యం లేక ఇబ్బందులు..
ఈ ప్రాంతంలో స్టోరేజ్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్తున్నయని రైతులు వాపోతున్నారు స్టోరీస్ సౌకర్యం ఉన్నట్లయితే ధరలేని సమయంలో కూరగాయలను అందులో భద్రపరచుకొని ధర ఉన్నప్పుడు అమ్మకాలు జరిపితే నష్టాలలో నుండి గట్టెక్కవలసిన పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుమ్మడిదలలో శీతలీకరణ గిడ్డంగిని ఏర్పాటు చేసినప్పటికీ దానిని సరైన మెయింటెనెన్స్ లేక దొంగల పాలై ఎందుకు పనికి రాకుండా పోయిందని రైతులు వాపోయారురైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
టమాటా పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు పెట్టిన పెట్టుబడి లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని గుమ్మడిదల రైతు సంఘం అధ్యక్షులు పోచుగారి మోహన్ రెడ్డి కోరారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు