సిరి న్యూస్ అందోల్ :
అందోల్ [Andole] లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో విద్యార్థినిలు జెల్ల దీక్షిత, ప్రశాంతి, తనుశ్రీ, గాయత్రి, మనస్విని,పాల్గొని పండగల యొక్క మరియు సంక్రాంతి యొక్క ఆవశ్యకత గురించి, తెలియజేశారు.
పాఠశాల ప్రిన్సిపల్ రాధాబాయ్ మాట్లాడుతూ పండగలు పిల్లలకు ఆనందాన్ని కలిగించటమే కాకుండా ముందస్తు తరాలకు పండగల యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినిలు సంక్రాంతి సంబంధించిన ముగ్గులు వేసి అందర్నీ మెప్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయునిలు రాధిక, మాధవి, లావణ్య, నజీన్, పద్మజ, సువర్ణ, సుశీల, ఫారెద్, తదితరులు పాల్గొన్నారు.