తహసిల్దార్ రజనీకుమారి..
రామాయంపేట[ramayampet] ఫిబ్రవరి 3 (సిరి న్యూస్)
ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రామాయంపేట తహసిల్దార్ రజని కుమార్ పేర్కొన్నారు. రామాయంపేట పట్టణంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో నేడు మండల వ్యాప్తంగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ప్రజల నుండి వచ్చాయని తెలిపారు.ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రజావాణి కార్యక్రమం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.మండల పరిధిలోని ప్రజలు పలు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు నేరుగా తమకు అందజేయాలని,ఈ అవకాశాన్ని మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.