
వెల్దుర్తి [Veldurthi] సిరి న్యూస్ జనవరి 23:
వెల్దుర్తి మరియు మాసాయి పేట మండల కేంద్రాలలో గురువారం రోజు ప్రజా పాలన గ్రామసభలు రసబసగా మారాయి. అధికారులు లబ్ధిదారుల లిస్టు చదవడంతో పథకాలు రానివారు ఒకేసారి మాకెందుకు రాలేవు అంటూ మండల స్పెషల్ ఆఫీసర్ ను ప్రశ్నించడం జరిగింది . అదే క్రమంలో వచ్చిన గ్రామస్తులకు కాంగ్రెస్ నాయకులు నచ్చజెప్పిన గ్రామస్తులు వినలేదు మేజర్ గ్రామ పంచాయతీలకు చాలా తక్కువ రేషన్ కార్డులు మంజూరు అయ్యావని అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా కొంతమందికే వచ్చాయని ఇండ్లు ఉన్నవారికి వచ్చాయని అధికారులపై మరియు నాయకుల పై మండిపడ్డారు. అక్కడే ఉన్న బి ఆర్ ఎస్ బిజెపి మరియు కాంగ్రెస్ నాయకులు కూడా ఒకరిపై ఒకరు వాదోపవాదములు చేసుకున్నారు. అక్కడే ఉన్న మండల పోలీస్ యంత్రాంగం మరియు అధికారులు కలగజేసుకొని నాయకులకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత అధికారులు మరియు నాయకులు గ్రామ సభకు వచ్చిన గ్రామస్తులకు ఇండ్లు ఉన్నవారి పేర్లు ఉంటే వాటిని తొలగిద్దామని ఇంకా ఎవరు లేని వారు ఉంటే ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవచ్చని నచ్చజెప్పడంతో గ్రామస్తులు సరే అని రానివారు అక్కడే ఉన్న కౌంటర్ల వద్ద దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాపాలన స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ సెక్రెటరీ బలరాం రెడ్డి కాంగ్రెస్ నాయకులు సుధాకర్ గౌడ్, శేఖ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు మోహన్ రెడ్డి, కృష్ణ గౌడ్ అశోక్ గౌడ్, రమేష్చందర్, చల్ల మహేష్, బిజెపి నాయకులు శేఖర్ గౌడ్, శ్రీనివాస్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.