పిజెఆర్ సేవలు చిరస్మరణీయం

PJR services are memorable
PJR services are memorable

పిజెఆర్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు[patancheru]
బడుగు బలహీనవర్గాలకు పిజెఆర్ చేసిన సేవలు మరువలేనివని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, కార్మిక నాయకులు దివంగత పి.జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు చేసిన మహోన్నత వ్యక్తి పి జె ఆర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యాం రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, అఫ్జల్, సంజీవ్ రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.