శివంపేట్[shivapeta] జనవరి 8(సిరి న్యూస్
1.శివంపేట్ మండలం బిజెపి మండల అధ్యక్షులుగా పెద్దపులి రవి కొనసాగుతున్నా కాలంలో ప్రతి గ్రామంలోని బిజెపి కార్యకర్తలను వెన్నంటు ఉండి గతంలో జరిగిన ఎంపీ ఎలక్షన్లలో మండలం నుండి ఎక్కువ మెజార్టీ రావడానికి కృషి చేశారు. ఇతను పిలుట్ల తాజా మాజీ సర్పంచ్ గా పనిచేశారు. గత 13 సంవత్సరాల నుండి బిజెపిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
మరల బిజెపి మండల అధ్యక్షులుగా నాకే ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
2.శివ్వంపేట మండల పరిధిలోని ఉసిరికపల్లి గ్రామానికి చెందిన అశోక్ సాదుల భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులుగా దాదాపుగా ఖరారు అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం… ఇటీవలే జరిగిన మండల అధ్యక్ష అభిప్రాయ సేకరణలో అశోక్ సాదుల వైపు మండల నాయకులు మొగ్గు చూపడంతో.. ఇక అధికార ప్రకటన కోసం ఎదురుచూడాల్సి ఉంది. అశోక్ సాదుల భారతీయ జనతాపార్టీలో గత రెండు పర్యాయాలు మండల ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. భారతీయ జనతా పార్టీలో గత ఏడు సంవత్సరాల నుంచి పార్టీని బలోపేతం చేయడంలో మండలంలో కీలక పాత్ర పోషించారు. గతంలో 2019 ఎంపీటీసీ ఎన్నికల్లో అతి చిన్న వయసులో జాతీయ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని ఎన్నికల బరిలో నిలిచి ప్రత్యర్థులతో పోరాడి ఓడాడు. గతంలో మండల ప్రధాన కార్యదర్శిగా రెండుసార్లు పనిచేసిన అనుభవం, అందర్నీ కలుపుకుపోయే స్వభావం, యువతను ఆకర్షించే విధంగా మాట్లాడడం, ఉన్నత చదువులు, సామాజిక వర్గం అన్ని అతని వైపే మొగ్గు చూపడంతో.. పార్టీ సీనియర్ నాయకులు సైతం.. అశోక్ సాదుల గారికి మండల బాధ్యతలు అప్పజెప్పాలని చూస్తున్నట్టుగా ఆ పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం… దాదాపుగా మండల పార్టీ అధ్యక్షులుగా అశోక్ సాదుల లేదా పెద్దపులి రవి అయ్యే అవకాశం ఉంది. సిరి న్యూస్ ప్రతినిధి తో మాట్లాడగా.. పార్టీ నిర్ణయం మేరకు అవకాశం కల్పిస్తే తప్పక పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తానని. స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.