
జనవరి 28 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
ఏ ఎస్ ఐ నుండి ఎస్ ఐ గా పదోన్నతి పొందిన మేదరి మహేంద్ర సంఘం వికారాబాద్ జిల్లా మేదరి మహేంద్ర సంఘం గౌరవ అధ్యక్షులు ప్యారసాని వెంకటయ్య గారికి సంగారెడ్డి జిల్లా మేదరి మహేంద్ర సంఘం జిల్లా కమిటీ తరపున సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబం నుండి పోలీస్ శాఖ లో ఉద్యోగం పొంది గత ముప్పై తొమ్మిది ఏండ్లు గా వివిధ హోదాల్లో పనిచేసీ ఎస్ ఐ గా ఇటీవల పదోన్నతి పొందిన వెంకటయ్య గారు మేదరి మహేంద్ర సంఘం సభ్యుల చైతన్యం కోసం కృషి చేయడం అభినందనీయం అని అన్నారు. అయన సేవలను సంఘం నాయకులు ఆదర్శంగా తీసుకోని సంఘం నిర్మాణం కొరకు కృషి చేయాలన్నారు. ఇట్టి కార్యక్రమం లో మేదరి మహేంద్ర సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబదాస్, గౌరవ అధ్యక్షులు నందికంటి నర్సిములు,వికారాబాద్ జిల్లా అధ్యక్షులు తిరుపతి, సంగారెడ్డి జిల్లా ఉపా ధ్యక్షులు దైవకుల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మహేంద్ర, కోశాధికారి పులి రాజు, ప్రచార కార్యదర్శి లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.