హీరా చార్జింగ్ బ్యాటరీ షోరూం ప్రారంభం
ప్రారంభించిన ఏఎస్సై రవీందర్ రెడ్డి
రామాయంపేట:మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో హీరా చార్జింగ్ బ్యాటరీ షోరూం ప్రారంభించారు. దుబ్బాక చెందిన అన్వర్ అలీ మౌనిక రియాజ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హీరా ఎలక్ట్రిక్ వెహికల్ షోరూం ను రామయంపేట ఏఎస్ఐ రవీందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యజమాని అన్వర్ అలీ మాట్లాడుతూ.. హీరా వెహికల్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు అతి తక్కువ ధరలో 42 వేల నుండి 72,000 వరకు ధర కలిగి ఉందని, సుమారు 60 నుండి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని వారు తెలిపారు నూతన టెక్నాలజీతో కొత్త హీరా ఈ వెహికల్ ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చినట్టు ఆయన తెలిపారు. రైతులు, ఉద్యోగస్తులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్, కార్తీక్, మహేందర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు