◆గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన బి.ఆర్.ఎస్ శ్రేణులు
◆హామీల అమలులో ప్రభుత్వం పూర్తి విఫలం.
◆ బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సార రామా గౌడ్.
కౌడిపల్లి[Kowdipally] జనవరి 30 (సిరి న్యూస్)
అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు కళ్ళు తెరిపించాలని ప్రభుత్వం ఏర్పడి 420 రోజులైనా ఇచ్చిన హామీల విఫలమైందని మండల బిఆర్ఎస్ శ్రేణులు గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. గురువారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మండల పరిధిలోని రైలాపూర్ గేటు సమీపంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సార రామ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా రామా గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అవుతున్న ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా గాంధీ మహాత్ముని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అల్మైపేట ఎల్లం ఉప సర్పంచ్ నరహరి,నాయకులు నర్సింలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు