ఒకప్పుడు రాజా వైభోగం నేడు ఎక్కడ చూసినా పాడుబడిన ఇల్లే ఆ ఊరు మొత్తం వలసలే.

Once Raja Vaibhogam, today everywhere is abandoned houses and the whole town is a migrant.
Once Raja Vaibhogam, today everywhere is abandoned houses and the whole town is a migrant.

నారాయణఖేడ్[narayankhed] ఫిబ్రవరి 5 (సిరి న్యూస్)
ఆ ఊరు నారాయణఖేడ్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లెటూరు. అక్కడ 80 శాతం పద్మశాలీలే ఒకప్పుడు రాజ వైభోగం నేడు ఆ ఊర్లో ఎక్కడ చూసినా వలసలు వెళ్లడంతో పాడుబడిన ఇల్లే దర్శనమిస్తాయి.ఏ ఇంట విన్న మగ్గాల చెప్పుల్లే.. ఊరు ఊరంతా మగ్గాల చెప్పులతో కిటకిటలాడేది. ఏ గడప చూసిన లక్ష్మి కళ.. ఏ ఇంట్లో చూసిన బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం.. చేతినిండా పని సిరి సంపదల గలగలలు.. రైతన్నలకె అప్పులు ఇచ్చే స్థాయి.. ఇదంతా గతం.. ఇప్పుడు ఆగ్రామంలో మగ్గాల చప్పుళ్ళు మూగబోయాయి.. మిషన్లు వచ్చాక చేసేందుకు పని కరువైంది. బతుకు భారమైంది. నేతన్నల తలరాతే మారింది. అప్పులు ఇచ్చే స్థాయి నుంచి అప్పు చేసి పూట గడుపుకునే స్థాయికి దిగజారింది. విధిలేక ఒక్కొక్కరుగా చేద్దామంటే ఉన్న ఊరిలో పని లేక బతుకుదెరువు వెతుక్కుంటూ వలస బాట పట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇల్లు పడావు పడ్డాయి. ఒకనాడు ఆర్థిక పరిపుష్టి తో కళకళలాడిన ఆ గ్రామం ఆనవాళ్లు కోల్పోయింది. ఒకనాడు ఆర్థిక పరిపుష్టి తో కళకళలాడిన ఆ ఊరు ఎవరికి ఏ సమస్య వచ్చినా డబ్బులు ఇచ్చి ఆదుకొని పండగ రోజుల గడిపేవారు. పొద్దస్తమానం ఆనందంగా సాగిన సమయం కేవలం రెక్కల కష్టంతో సంపాదించిన సందర్భం నేతన్నల ఇళ్ళముందు పెద్ద పెద్ద ఆసాములు పంట పెట్టుబడి కోసం పడిగాపులు కాసేవారు. ఆ గ్రామం సిరి సంపదలతో లక్ష్మి కళ ఉట్టిపడ్డ రోజులవి భారీ భవంతులతో కూడిన ఇళ్ల నిర్మాణాలు..ఉమ్మడి కుటుంబాల జీవనం ఇదంతా 37 ఏళ్ల హనుమంత రావు పేట గ్రామ వైభవం. కాలం గిర్రున తిరిగింది మిషన్ వస్త్రాల రాకతో పని లేక మగ్గాలు మూలన పడ్డాయి. ఫలితంగా సిరి సంపదలతో తులతూగే నేతన్నలకు రోజు గడవడమే గగనమైంది. దీంతో జనం ఇళ్లను వదిలి పిల్లాపాపలతో మూటాముల్లె సర్దుకుని వలసలు వెళ్లారు..వెళ్ళినవారు వెళ్లినట్లే ఊరి వైపు మళ్లీ చూడడం మానేశారు.దీంతో ఇల్లు పాడు బడ్డాయి. ఊరు కల కోల్పోయింది. గ్రామంలో 404 నివాసాలు.1,711 మంది జనాభా.80శాతం పద్మశాలి చేనేత కార్మికులే గ్రామంలో అనేక మంది నేత కార్మికుల ఇల్లు రెండు అంతస్తులతో స్థానిక పటేల్ దొరలు భూస్వాముల నివాసాలను తలదన్నేలా ఉంటాయి..అంతా వైభవంగా సాగిన బతుకులు విరివి

ఇళ్ళ ముందు పెద్దపెద్ద వాకిళ్ళలో చేనేత మగ్గాలు ఉదయం మూడు గంటలకే నేత పనులు ప్రారంభమయ్యేవి. నేతన్నల నేత చప్పుళ్లు తెల్ల తెల్లవారే ముంగిట్లో లయబద్ధంగా సాగుతుంటే ఊరు తెలవారేది. రాత్రి పొద్దు పోయే వరకు చేతినిండా పనులతో బిజీబిజీగా గడిపే వారు. వీరు బతకడమే కాకుండా నలుగురికి పనులు కల్పించేది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు సైతం చేనేత కార్మికుల వద్ద పెట్టుబడులకు డబ్బులు తీసుకు వెళ్ళేది.37 ఏళ్లు గా మారిన బతుకులు.. మిషన్ బట్టలు మార్కెట్లోకి రావడంతో వీరి బతుకులు మసకబార్చాయి. ఏనాడు బయటి పనులు చేసి ఎరుగని నేత మహిళలు పరిస్థితులు తిరగడంతో తమ పిల్లలను తీసుకొని వెళ్లి భర్తలకు సహాయంగా కూలీ పనులు చేయడం ప్రారంభించారు. హైదరాబాద్, సూరజ్, గుజరాత్, సోలాపూర్, నిజామాబాద్, సిరిసిల్ల, వేములవాడ ఇలా ఎక్కడపడితే అక్కడ కి వలస వెళ్లారు. కొందరు ఆయా ప్రాంతాల్లో నేత పనులు చేస్తుండగా అత్యధికంగా భవన నిర్మాణాలు కర్మాగారాలు ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. హనుమంతరావు పేట నేడు జవజీవాలు కోల్పోయిo ది. 80 శాతం నేతన్నలు వలస వెళ్లడంతో వారి ఇల్లు కూలి పోయి వెక్కిరిస్తున్నాయి.

నేడు ఎక్కడ చూసినా మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. మరికొన్ని గృహాలు నేలమట్టమయ్యాయి. ఊరిలో ఓటుహక్కు ఉన్న కొందరు ఎన్నికల సమయంలో వచ్చి పడావు పడ్డ తమ ఇళ్లను చూడలేక కన్నీళ్ళతో తిరుగుముఖం పడుతున్నారు. మరికొందరు. ఒకరిద్దరు ఇళ్ళల్లోనే నేత పనులు చేసుకుంటూ బతుకు ఈడుస్తున్నారు. కొంతమంది మహిళలు బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. పొద్దస్తమానం కష్టపడి 500 బీడీలు చుడితే వీరికి వచ్చే సంపాదన కేవలం రూ.100 ఇళ్ల వద్ద ఉన్న భర్తలు వ్యవసాయ పనులు కూలి పనులు చేస్తున్నారు. ఊరిని వదలని ఒకరిద్దరు ఉన్నవారు. ఇలా అనేక కష్టాలను ఓర్చుకునే కాలం వెళ్లదీస్తున్నారు. వారి పిల్లలు సైతం ఆటో డ్రైవర్లుగా ఇతరాత్రా పనుల్లో కూలీలుగా మారుతున్నారు. అనేక ఇళ్లల్లో పిల్లలు వలస వెళ్ళగా వారి తల్లిదండ్రులు మాత్రం కూలిపోవడానికి రెడీగా ఉన్న ఇండ్లలోనే కనిపిస్తారు. 37 సంవత్సరాల క్రితం ఊరిలో జనాభా మూడు వేలు ఉండగా ప్రస్తుతం 1,711మంది జనాభా ఉన్నామని అన్నారు. అన్ని గ్రామాల్లో జనాభా పెరుగుతుంటే మా గ్రామంలో మాత్రం జనాభా తగ్గుతోందని వాపోయారు. తెలంగాణ వచ్చాక నైనా మా బతుకులు మారుతాయి. అని అనుకున్నాము కానీ తెలంగాణ వచ్చిన మా బ్రతుకులు మాత్రం అలాగే ఉన్నాయని నేతన్నలు వాపోయారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా నేతన్నలను ఆదుకోవాలని కన్నీటి పర్వంతమయ్యారు.